ECI : ఉపరాష్ట్రపతి ఎన్నికల (Vice president elections) కోసం ఎలక్టోరల్ కాలేజ్ (Electoral college) ప్రిపరేషన్ పూర్తయ్యిందని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. ఎలక్టోరల్ కాలేజ్ జాబితాలో రాజ్యసభ (Rajya Sabha), లోక్‌సభ (Lok Sabha) సభ్యుల స్థానాలు.. వారివారి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఉంటాయని ఈసీ తెలిపింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదేరోజు నుంచి ఈసీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేయబోయే కౌంటర్లో ఎలక్టోరల్ కాలేజ్‌కు సంబంధించిన జాబితా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని ఈసీ తన పోస్టులో వెల్లడించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 (1) ప్రకారం.. ఎన్నికైన రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు, ఎన్నికైన లోక్‌సభ సభ్యులతో కూడిన ఎలక్టోరుల్ కాలేజ్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఎన్నికలు నిర్వహించి నూతన ఉపరాష్ట్రపతిని నియమించడం ఎన్నికల సంఘం విధిగా ఉంటుంది.
కాగా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలు చూపి ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఒకరోజు గ్యాప్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ రాజీనామాకు ఆమోదం తెలిపారు. దాంతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఎలక్టోరల్ కాలేజ్ ప్రిపరేషన్‌ను పూర్తిచేసింది.
Election Commission of India tweets, “Preparation of Electoral College completed for Vice-Presidential Election 2025” pic.twitter.com/VtDsFgGpfe
— ANI (@ANI) July 31, 2025