Crime news | పుట్టినరోజు నాడే కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య..!
Crime news | పుట్టినరోజు (Birthday) కావడంతో ఓ యువకుడు బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మరో యువకుడు బైక్‌పై వచ్చి వారి కారును గుద్దడంతో గొడవ జరిగింది. గొడవ పెద్దదిగా మారడంతో బైకర్, అతని స్నేహితులు బర్త్‌డే జరుపుకుంటున్న యువకుడిని కత్తులతో పొడిచి చంపారు.
Crime news : పుట్టినరోజు (Birthday) కావడంతో ఓ యువకుడు బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మరో యువకుడు బైక్‌పై వచ్చి వారి కారును గుద్దడంతో గొడవ జరిగింది. గొడవ పెద్దదిగా మారడంతో బైకర్, అతని స్నేహితులు బర్త్‌డే జరుపుకుంటున్న యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. దేశ రాధాని ఢిల్లీ (Delhi) లోని ఘాజీపూర్ (Ghazipur) లోగల పేపర్ మార్కెట్ ఏరియా (Paper Market area) లో ఈ హత్య జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. వికాస్ అనే యువకుడు ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవలే పెళ్లి కూడా నిశ్చయమైంది. పైగా బుధవారం అతడి పుట్టినరోజు కూడా. దాంతో బుధవారం విధులు ముగియగానే స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. పార్టీ అనంతరం తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సుమిత్తో కలిసి మరోసారి లిక్కర్ షాపుకు వెళ్లారు. ఆ లిక్కర్ షాపులో మద్యం తీసుకుని షాపు ముందే రోడ్డు పక్కన కారులో మద్యం సేవిస్తున్నారు.
అదే సమయంలో మద్యం కోసం వచ్చిన మరో యువకుడు వారి కారును గుద్దుకుంటూ వెళ్లాడు. కారుకు గీతలు పడటంతో వికాస్ అతడితో గొడవకు దిగాడు. ఆ గొడవ ఇద్దరూ బూతులు తిట్టుకునే వరకు వెళ్లింది. దాంతో అవతలి వ్యక్తి తన మిత్రులకు ఫోన్ చేశాడు. దాదాపు ఆరుగురు వ్యక్తులు వచ్చి.. వచ్చీరావడంతోనే వికాస్, సుమిత్‌లపై ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగక వికాస్‌ను కత్తులతో పొడిచారు.
దాంతో వికాస్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన సుమిత్‌ను ఘాజీపూర్‌లోని లాల్ బహదూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వికాస్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు.
Read More >>
ఆరు భారతీయ చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య.. రద్దైన వందలాది విమానాలు
ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురు నిర్దోషులే.. మాలేగావ్ పేలుడు కేసులో ముంబై కోర్టు సంచలన తీర్పు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naga Chaitanya | ఏడవాలని ఉంటుంది, కానీ కన్నీళ్లు రావు.. తనలోని బాధను బయటపెట్టిన నాగ చైతన్య
Aadarsha Kutumbam | ఓటీటీలోకి విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nayanthara | నయనతార పోలికతో ట్రాన్స్‌జెండర్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు.. !
Chiranjeevi | ఓటీటీ చరిత్రలోనే భారీ రెమ్యునరేషన్.. ‘మెగావర్స్’ కోసం చిరంజీవికి రూ.200 కోట్లు ఇస్తున్నారా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో చివరి కెప్టెన్సీ పోటీ.. అమన్‌తో శివ గొడవ.. హౌస్‌లో రచ్చ రచ్చ!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

