Air Traffic Glitch | యునైటెడ్ కింగ్డమ్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య (Air Traffic Glitch) తలెత్తింది. దీంతో యూకే వ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో (UK airports) వందలాది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. పలు ముఖ్యమైన విమానాశ్రయాల్లో దాదాపు 150కిపైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం సాయంత్రం 4:05 గంటలకు ఈ సమస్య తలెత్తింది. అయితే, 20 నిమిషాల్లో సమస్యను పరిష్కరించినట్లు నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (National Air Traffic Service) ఓ అధికార ప్రకటనలో వెల్లడించింది.
ఎన్ఏటీఎస్ స్వాన్విక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లో ఎదురైన సాంకేతిక లోపం.. గాట్విక్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, కార్డిఫ్, ఎడిన్బర్గ్, లండన్ వంటి ప్రముఖ విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బ్రిటన్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన హీత్రో ఎయిర్‌పోర్ట్‌లోనూ ఈ సమస్య ప్రభావం చూపించింది. సమస్యను 20 నిమిషాల్లో పరిష్కరించినప్పటికీ విమాన రాకపోకల్లో ఆలస్యాలు కొనసాగినట్లు యూకే మీడియా నివేదించింది. ఈ సమస్య కారణంగా యూకే వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూకే విమానాశ్రయాల్లో పడిగాపులు కాశారు.
Also Read..
Indira Krishnan | క్యాస్టింగ్ కౌచ్ వలన పెద్ద ఆఫర్లు కోల్పోయాను.. ‘రామాయణం’ నటి ఇందిరా కృష్ణన్