Indira Krishnan on casting couch | ప్రముఖ బాలీవుడ్, టీవీ నటి ఇందిరా కృష్ణన్ క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలపై పంచుకుంది. తాను నో చెప్పడం వలన పెద్ద పెద్ద సినిమాలు కోల్పోయాను అంటూ నటి చెప్పుకోచ్చింది.
ఇందిరా మాట్లాడుతూ.. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో నాకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో తాను హీరోయిన్గా ఎంపికైనప్పటికీ కమిట్మెంట్ అడిగినందుకు నేను నో చెప్పడం వలన ఆ సినిమాలలో అవకాశం కోల్పోయాను. నేను నా టాలెంట్‌ను అమ్ముకోవడానికి వచ్చాను కానీ.. నన్ను అమ్ముకోవడానికి కాదు అంటూ వారికి గట్టిగా సమాధానం చెప్పి వచ్చాను. కొన్ని సార్లు ఈ మనం మాట్లాడే మాటలు కఠినంగా అనిపించినా కూడా చెప్పాల్సింది చెప్పేయాలి. అప్పుడే ముందుకు వెళ్లగలుగుతాం. అయితే సినిమాలలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కోన్న తర్వాతే తాను టెలివిజన్ రంగంలోకి వెళ్లాను. అక్కడ ఇలాంటి సమస్యలేం కనిపించలేదంటూ ఇందిరా కృష్ణన్ చెప్పుకోచ్చింది.
ఇందిరా కృష్ణన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి వస్తున్న ‘రామాయణం’ చిత్రంలో కౌసల్య పాత్ర నటిస్తుంది. ఈ సినిమాకు దంగల్ ఫేం నితేష్ తీవారీ దర్శకత్వం వహిస్తుండగా.. ణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ రావణుడిగా నటిస్తున్నాడు.