Donald Trump | మిత్ర దేశం అంటూనే భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. మన దేశంపై ఇప్పటికే 25 శాతం సుంకాలతోపాటు జరిమానాలు కూడా విధించిన విషయం తెలిసిందే. రష్యా (Russia) నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడమే అందుకు కారణమని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్, రష్యాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా నాకు సంబంధం లేదు. వారు (భారత్, రష్యాని ఉద్దేశిస్తూ) వారి ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నారు. మేము న్యూ ఢిల్లీలో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నాము. ఎందుకంటే భారత్ అత్యధికంగా సుంకాలు విధిస్తోంది’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో పేర్కొన్నారు. మాస్కోతో యూఎస్ ఎలాంటి వ్యాపారం చేయట్లేదని కూడా ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
Also Read..
Donald Trump | భారత్‌పై టారీఫ్‌లు.. ఫెనాల్టీలు.. పాకిస్థాన్‌తో ట్రంప్ వాణిజ్య ఒప్పందాలు..
Donald Trump | భారత్‌పై అక్కసు.. 25శాతం టారీఫ్, పెనాల్టీ విధించిన ట్రంప్..!
Powerful Earthquakes | ప్రపంచాన్ని వణికించిన అత్యంత శక్తివంతమైన భూకంపాలు ఇవే..