Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పని చేశారు. రష్యా(Russia)తో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఆంక్షలు, జరిమానా భారం తప్పదని హెచ్చరించిన ట్రంప్.. భారత్‌పై 25శాతం టారిఫ్ ప్రకటించారు. తాము వారించినా వినకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇండియాపై టారీఫ్తో పాటు అదనపు పెనాల్టీ కూడా విధించారు.
భారత్ మా మిత్రదేశం అంటూనే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని బుధవారం అమెరికా ప్రెసిడెంట్ తన సోషల్ మీడియా ఖాతా ట్రుత్ సోషల్ వేదికగా వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి భారత్ దిగుమతి చేసుకొనే వస్తువులపై కొత్త టారీఫ్, పెనాల్టీ నిబంధనలు వర్తిస్తాయని ట్రంప్ వెల్లడించారు.
Donald Trump has just imposed a 25% tariff on India. He has also imposed a penalty.
⦁ Modi campaigns for Trump.
⦁ Gives out slogans like ‘Abki Baar Trump Sarkar’.
⦁ Hugs him like a long-lost brother.In return, Trump goes on to impose such harsh tariff on India.
It is… pic.twitter.com/EOq0i03mf7
— Congress (@INCIndia) July 30, 2025
‘భారత్ మాకు మిత్ర దేశమే. ఈ విషయాన్ని మేము మరువం. కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య వ్యాపారం తక్కువ మోతాదులోనే కొనసాగింది. ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోల్చితే ఇండియాలో టారీఫ్‌లు ఎక్కువ. భారత్ అనుసరించే వ్యాపార, వాణిజ్య నిబంధనలు కఠినంగా ఉంటాయి. నగదు రహిత వాణిజ్యానికి ఇవి పెద్ద అడ్డంకిగా మారాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు భారత్, రష్యా మధ్య రక్షణ, ఇంధన పరమైన ఒప్పందాలపై ఆయన స్పందించారు.
‘రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున తమ సైన్యానికి అవసరమైన ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం ఆ దేశపు ఆయుధాలను భారీగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా, ఇండియాదే అగ్రస్థానం. అందుకే భారత్‌పై 25 శాతం టారీఫ్తో పాటు పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి’ అని ట్రంప్ వెల్లడించారు. పాకిస్థాన్‌తో యుద్ధం విరమించాలని తమకు ఏ దేశాధినేత చెప్పలేదని ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభలో ప్రకటించిన మరునాడే ట్రంప్ టారీఫ్‌ల మోత మోగించడం గమనార్హం.