Amanda Wellington : ఈ టీ20ల కాలంలో అందరూ ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ క్రికెటర్ సైతం తనకు దేశం కంటే ఫ్రాంచైజీలకు ఆడడమే నచ్చుతుందని తెలిపింది. ఆమె ఎవరో కాదు ఆస్ట్రేలియా మహిళల జట్టు స్పిన్నర్ అమంద వెల్లింగ్టన్ (Amanda Wellington). మామూలుగా కంగారూ జట్టు ఆటగాళ్లు చాలామంది దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. కానీ, ఈమె మాత్రం తనకు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడడం ఇష్టముండదని వెల్లడించింది. పొట్టి క్రికెట్ వైపే మొగ్గు చూపడానికి ఓ కారణం ఉందంటోంది అమందా.. అదేంటంటే..?
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో పవర్ ప్లే పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అమందా అంతేకాదు మానసికంగా ఆరోగ్యంగా ఉండడం, వ్యక్తిగతంగా అన్ని విధాలా సంతృప్తిగా జీవించడం తన తొలి ప్రాధాన్యాలని చెప్పింది. ఇక ఫ్రాంచైజీ క్రికెట్‌ను ఎంచుకోవడం గురించి ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఎందుకు జాతీయ జట్టు సెలెక్షన్స్‌కు దూరంగా ఉంటున్నానో కూడా వివరించింది. ‘అంతర్జాతీయ క్రికెట్ ఆడకూడదనేది నేను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం టీ20 లీగ్స్ రూపంలో బోలెడన్ని అవకాశాలు ఉన్నప్పుడు జాతీయ జట్టుకే ఆడాలనుకోవడంలో అర్దం లేదు.
Amanda-Jade Wellington explains her decision on choosing franchise cricket over internationals!🏏#CricketTwitter pic.twitter.com/RG2stlfZCC
— Female Cricket (@imfemalecricket) July 30, 2025
నేనైతే దేశం కంటే ఫ్రాంచైజ్ క్రికెట్‌కే ఓటేస్తాను. అలా అనీ నన్ను అపార్థం చేసుకోవద్దు. ఆస్ట్రేలియాకు ఆడడం నిజంగా గొప్ప గౌరవం. అయితే.. మ్యాచ్‌ల కోసం ప్రపంచాన్ని చుట్టి రావడం..పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించి వివిధ దేశాల క్రికెటర్లతో పరిచయాలు పెంచుకోవడం నాకు చాలా ఇష్టం అని చెప్పిందీ లెగ్ స్పిన్నర్.
దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన అమందా 2016లో అరంగేట్రం చేసింది. 2022 మహిళల వన్డే వరల్డ్ కప్ ఆడిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యురాలు తను. ఇప్పటివరకూ ఆమె ఆసీస్ తరఫున 14 వన్డేలు, 8 టీ20లు, ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడింది. మూడు ఫార్మట్లలో కలిపి 30 వికెట్లు తీసిందంతే. కొన్నాళ్లుగా బిగ్బాజ్ లీగ్, ది హండ్రెడ్ లీగ్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌ల మీదనే దృష్టి పెట్టిన అమందా పలు జట్లకు ప్రాతినిధ్యం వహించింది. సదర్న్ వైపర్స్ ఒటాగో, సదర్న్ బ్రేవ్. మాంచెస్టర్ ఒరిజినల్స్, వెస్టర్న్ స్టార్మ్, ఓవల్ ఇన్విజిబుల్స్ జట్ల జెర్సీతో బరిలోకి దిగిందీ స్పిన్నర్. బీబీఎల్‌లో అమందా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన .. 5-8.
A big-hitting, wicket-taking all-rounder hailing from Australia 🏏
Happy birthday Amanda-Jade Wellington 🥳 #teamgm pic.twitter.com/a4o7ezhUVE
— GM Cricket 🏏 (@GMCricket) May 29, 2025