Prithviraj Sukumaran | తెలుగు సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. యాక్టింగ్, డైరెక్షన్, స్క్రీన్-ప్రెజెన్స్‌తో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ ఆడియన్స్‌ని అలరిస్తున్నాడు. దాదాపు వందకు పైగా సినిమాలలో నటించి మెప్పించాడు. సలార్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు ఈ హీరో. ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. పృథ్వీ రాజ్ 2011లో సుప్రియా మీనన్‌ని వివాహం చేసుకోగా, అంతక ముందు 4 సంవత్సరాలు డేటింగ్ చేశారు. పృథ్వీరాజ్‌కి ఎంతో సపోర్టివ్‌గా ఉంటుంది. భార్య త్యాగాన్ని కూడా పృథ్వీరాజ్ ఎంతో విలువైనదిగా భావిస్తాడు. ఆమెకు చాలా రుణపడి ఉన్నానని పలు సందర్భాల్లో ఓపెన్‌గా చెప్పాడు
పృథ్వీరాజ్ సతీమణి సుప్రియ ఇప్పుడు పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌కి కో-ఫౌండర్‌గా ఉంటూ తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో తెర వెనుక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ జంటకు ఒక కూతురు ఉంది. సుప్రియ అటు పర్సనల్ లైఫ్‌ని, ఇటు వర్క్‌ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తోంది. అయితే సుప్రియ మీనన్ ఏడేళ్లుగా వేధింపులకు గురవుతున్నాను అంటూ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ అవుతుంది. 2018 నుంచి ఇన్ స్టాగ్రామ్ లో ఓ మహిళా తనను వేధిస్తుందని, ఉద్దేశపూర్వకంగా తన గురించి అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నట్లు చెప్పుకొచ్చింది.
ఆ మహిళ ఫొటోని కూడా షేర్ చేస్తూ.. ఏ ఫిల్టర్ కూడా ఆమె పై తనకున్న ద్వేషాన్ని కప్పిపుచ్చలేకపోతుందని అసహనం వ్యక్తం చేశారు. 2018 నుంచి ఆ మహిళ నాకు తెలుసు. కాకపోతే ఆమెకు చిన్న బాబు ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు నేను సైలెంట్‌గా ఉన్నాను. ఇప్పుడు ఆమె మా తండ్రిపై కూడా నిందలు వేస్తుంది. ఇప్పటికే ఆమె అకౌంట్‌ని ఎన్నో సార్లు బ్లాక్ చేశాను. అయినప్పటికీ కొత్త ఖాతాలను సృష్టించుకొని నన్ను బాధపెట్టడమే ఆమె పనిగా పెట్టుకుంది. ఆమె క్రియేట్ చేసిన ప్రతీ అకౌంట్ బ్లాక్ చేయడం నా డైలీ రొటీన్ లో భాగం అయిందని సుప్రియ ఆవేదనను వ్యక్తం చేసింది. ఒక స్టార్ హీరో భార్య ఇలా ఆన్ లైన్ వేధింపులకు గురికావడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. కాగా, సుప్రీయ గతంలో ఓ మీడియా సంస్థలో జర్నలిస్టుగా పని చేసింది. ఆ సమయంలో పృథ్వీ రాజ్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. సుప్రియ ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.