Jay Shah : పొట్టి ప్రపంచకప్ ఆరంభానికి ముందు నెలకొన్న నాటకీయ పరిణామాలపై ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు జై షా (Jay Shah) నోరు మెదిపాడు. మెగా టోర్నీకి కొన్ని రోజుల ముందు ఏర్పడిన అనిశ్చితి వాతావరణంపై స్పందించిన షా.. ఐసీసీ కంటే ఏ దేశం పెద్దది కాదని పేర్కొన్నాడు. తాజాగా బీసీసీఐ వార్షిక అవార్డుల (BCCI Annual Awards) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బంగ్లాదేశ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు.
పదో సీజన్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు.. భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్, టీమిండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాకిస్థాన్ బోర్డు బెట్టు చేసిన విషయం తెలిసిందే. ఇరుదేశాల బెదిరింపులకు ఏమాత్రం లొంగని ఐసీసీ చైర్మన్ జై షా.. తెలివిగా అనిశ్చితికి తెరదించాడు. అభిమానుల్లో ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారంపై బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో షా మాట్లాడాడు. ‘ఈ పొట్టి ప్పరంచకప్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే టోర్నీ ఆరంభానికి ముందు చాలా గందరగోళం నడించింది.
“No Team Is Bigger”: Jay Shah Finally Responds To Bangladesh, Pakistan’s Pre-T20 World Cup Drama#T20WorldCuphttps://t.co/L6aKBdLr6p
— CricketNDTV (@CricketNDTV) March 15, 2026
వరల్డ్‌కప్‌లో కొన్నిజట్లు పాల్గొంటాయా? లేదా? ప్రపంచకప్ సాఫీగా జరుగుతుందా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ, ఐసీసీ చైర్మన్‌గా నేను కటే చెబుతాను. ఏ దేశం కూడా ఐసీసీ కంటే పెద్దది కాదు. అలాఅనీ ఒక జట్టుతోనే ఐసీసీ పరిపూర్ణం కాదు. అన్ని జట్లు కలిస్తేనే ఐసీసీ’ అని జై షా పేర్కొన్నాడు.
ప్రపంచకప్‌లో చిన్నజట్ల సంచలన ప్రదర్శనలు, మెగా టోర్నీలో రికార్డు వీక్షణలపై కూడా ఐసీసీ చైర్మన్ స్పందించాడు. ‘ఈ ప్రపంచకప్ గత వీక్షణల రికార్డులను బ్రేక్ చేసింది. ఏకంగా.. 70.2 లక్షల మందికి పైగా లైవ్‌లో చూశారు. చిన్న జట్టైన యూఎస్ఏ తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు గట్టి పోటీనిచ్చింది. పాకిస్థాన్‌ను నెదర్లాండ్స్ వణికించింది. జింబాబ్వే సంచలన ఆటతో పెద్ల జట్లైన శ్రీలంక, ఆస్ట్రేలియాను ఓడించింది.
🚨JAY SHAH ON TEAM INDIA’S GROWTH SINCE 2019.🚨
“From 2019 to 2026, Team India achieved great success — 2 U-19 Men’s WC, 2 U-19 Women’s WC, WTC runner-up twice, ODI WC runner-up, back-to-back T20 WC titles, and the 2025 CT. Congratulations to everyone.”pic.twitter.com/7F6ZOiCVyV
— Sam (@Cricsam01) March 14, 2026
నేపాల్ అసమాన పోరాటంతో ఇంగ్లండ్‌ను ఓడించినంత పని చేసింది. పూర్తి స్థాయి జట్లపై గొప్ప ప్రదర్శన కనబరిచిన అసోసియేటెడ్ జట్లకు అభినందనలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్న షా.. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతం గంభీర్‌లకు భవిష్యత్ టోర్నీలకు పక్కాగా సిద్ధమవ్వాలని సూచించాడు. 2030, 2031 మాత్రమే కాదు 2036కు కూడా టీమిండియా సన్నద్ధంగా ఉండేలా స్క్వాడ్‌ను పటిష్టం చేసుకోవాలని ఐసీసీ చీఫ్ తెలిపాడు. భారత క్రికెట్‌కు విశేష సేవలందించినందుకు షా బీసీసీఐ అవార్డు అందుకున్నాడు.