NISAR satellite : నిసార్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూపరిశీలనా ఉపగ్రహం (Satellite) ‘నిసార్ (NISAR)’ సక్సెస్ఫుల్గా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. మొత్తం 2,392 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భారత్కు చెందిన GSLV-F16 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి మోసుకెళ్లింది. జీఎస్ఎల్వీ రాకెట్ నిసార్ ఉపగ్రహాన్ని 740 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్ష్యలోకి చేర్చింది.
బుధవారం సాయంత్రం సరిగ్గా 5:40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో, నాసా కలిసి మొత్తం 1.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ ద్వారా భూమి ఉపరితలాన్ని పరిశీలించే విధానంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అదేవిధంగా సహజ విపత్తులను, పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడంలో నిసార్ ఉపగ్రహం కీలకపాత్ర పోషించనుంది.
నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్) అనేది ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు అని ఇస్రో, నాసా సైంటిస్టులు చెబుతున్నారు. ఇది డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ (నాసా ఎల్-బ్యాండ్, ఇస్రో ఎస్-బ్యాండ్) ను ఉపయోగించి భూమిని మొదటిసారిగా పరిశీలించనుందని తెలిపారు. ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరిన తర్వాత అది ప్రతి 12 రోజులకు భూమిని, మంచుతో కప్పబడిన ఉపరితలాలను 242 కిలోమీటర్ల వెడల్పుతో అధిక-రిజల్యూషన్ చిత్రాలతో స్కాన్ చేస్తుందని వెల్లడించారు. అందుకోసం మొదటిసారిగా స్వీప్సార్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
#WATCH | NASA-ISRO NISAR satellite onboard GSLV-F16 launched from Satish Dhawan Space Centre (SDSC) in Sriharikota, Andhra Pradesh
NISAR, or NASA-ISRO Synthetic Aperture Radar is a joint venture of ISRO and NASA and has been designed to provide a detailed view of the Earth to… pic.twitter.com/Cx942PCufJ
— ANI (@ANI) July 30, 2025