NISAR satellite | మరికాసేపట్లో నింగిలోకి నిసార్ ఉపగ్రహం.. ఇస్రో, నాసా సంయుక్త ప్రయోగం
NISAR satellite | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూపరిశీలనా ఉపగ్రహం (Satellite) ‘నిసార్ (NISAR)’ మరికాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది.
NISAR satellite : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూపరిశీలనా ఉపగ్రహం (Satellite) ‘నిసార్ (NISAR)’ మరికాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. బుధవారం సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోట (Sriharikota) లోని సతీష్ ధావన్ (Satish Dhavan) అంతరిక్ష కేంద్రం (Space centre) నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.
ఏకంగా 1.5 బిలియన్ డాలర్లను ఖర్చుతో ప్రయోగిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ భూమి ఉపరితలాన్ని పరిశీలించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అదేవిధంగా సహజ విపత్తులను, పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడంలో కీలకపాత్ర పోషించనుంది. నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్) అనేది ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు అని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇది డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ (నాసా ఎల్-బ్యాండ్, ఇస్రో ఎస్-బ్యాండ్) ను ఉపయోగించి భూమిని మొదటిసారిగా పరిశీలించనుంది. 2,392 కిలోగ్రాముల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భారత్కు చెందిన జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ రాకెట్.. నిసార్ ఉపగ్రహాన్ని 740 కిలోమీటర్ల ఎత్తులో సూర్య అనువర్తిత కక్ష్యలోకి చేరుస్తుంది.
నిర్ణీత కక్ష్యలోకి చేరిన తర్వాత అది ప్రతి 12 రోజులకు భూమిని, మంచుతో కప్పబడిన ఉపరితలాలను 242 కిలోమీటర్ల వెడల్పుతో అధిక-రిజల్యూషన్ చిత్రాలతో స్కాన్ చేస్తుంది. అందుకోసం మొదటిసారిగా స్వీప్సార్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
Read More >>
ఆ గ్రహశకలం చంద్రుడిని ఢీకొడితే భూమిపైనా తీవ్ర ప్రభావం..!
రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు.. సింధూ జలాల ఒప్పందంపై విదేశాంగ మంత్రి
రాజస్థాన్లో కుండపోత వర్షం.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
హనీమూన్ హత్యపై సినిమా.. ఓకే చెప్పిన రాజారఘువంశీ కుటుంబం
భారత్కు సునామీ ముప్పులేదు.. స్పష్టం చేసిన ఇన్కాయిస్
అదుపుతప్పి నదిలోపడ్డ ఐటీబీపీ బస్సు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. Video
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

