Rajasthan rains : రాజస్థాన్ (Rajasthan) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరదలు (Floods) పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వరదనీరు నిలువడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్లో స్కూళ్లను మూసేశారు. సవాయి మాధోపూర్ రైల్వేస్టేషన్లో పట్టాలపై భారీగా వరద నీరు చేరింది. దాంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా టోంక్ కోర్టు ప్రాంగణంతోపాటు రహదారులు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. నీట మునిగిన ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
రాజస్థాన్లో ఆగస్టు 2వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ మేరకు రెడ్ అలర్ట్ జారీచేసింది. జైపూర్తోపాటు కోటా, అళ్వార్ తదితర జిల్లాలో కుంభవృష్టి కురుస్తోంది.