కాలిఫోర్నియా : రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పంలో వచ్చిన భూకంపంతో.. పసిఫిక్ తీరాల్లో సునామీ హెచ్చరికలు(Tsunami warnings) జారీ చేశారు. జపాన్‌తో పాటు అమెరికాలోనూ హెచ్చరికలు ఇచ్చారు. దీంతో హవాయి ద్వీపంలో అప్రమత్తత ప్రకటించారు. హవాయిలోని వైకిక్కి బీచ్‌లో ఉన్న పర్యాటకులు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. కార్లలో వచ్చిన వారంతా తమ వాహనాలను తీసుకుని సురక్షిత ప్రదేశానికి వెళ్తున్నారు. మరికొన్ఇన గంటల్లో ఆ ప్రాంతాన్ని సునామీ అలలు తాకే ప్రమాదం ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ప్రకటన చేశారు. నార్త్ కోస్ట్ వెంట సునామీ వార్నింగ్ జారీ చేశారు. కేప్ మెండోకినో నుంచి ఓరేగాన్ బోర్డర్ వరకు అప్రమత్త ఉందన్నారు.
🚗 🚙 🚘 BUMPER TO BUMPER… Absurd traffic now in #Hawaii as both residents and tourists/vacationers are fleeing coastal areas to escape #tsunami waves—now expected in about 45 minutes (7:10pm HST). TSUNAMI WARNING‼️
DEVELOPING… pic.twitter.com/zsNjQRHNV2
— Steve Norris (@SteveNorrisTV) July 30, 2025
ఫిలిప్పీన్స్, ఇండోనేషియాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చిన్న పాటి అలలు ఆ తీరాలను తాకే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మనీలా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఒక మీటరు ఎత్తు వరకు సునామీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్ వొల్కనాలజీ, సెసిమాలజీ ఏజెన్సీ తెలిపింది. సుమారు 20 ప్రావిన్సులకు చెందిన బీచ్ ప్రజల్ని అప్రమత్తం చేశారు. తూర్పు ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. నార్త్ సులవేసి, నార్త్ మలూకు, వెస్ట్ పాపువా, గొరంటోలా ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు.
People in Maui Hawaii trying to escape the tsunami are BEGGING Oprah to OPEN THE ROAD and she’s still refusing #Tsunami pic.twitter.com/Q0SiZu1JZU
— ☆La 🤍 (@Ayah2156) July 30, 2025
At least 4 whales have washed up along the coast of Japan, hours after 8.8 earthquake
Civilians seen on top of building in Hokkaido, Japan amid tsunami warning.
Tsunami Warning ⚠️ Russia, Alaska, Hawaii, Japan #earthquake #tsunami #Russia #Japan #Hawaii #Alaska pic.twitter.com/3BhfkszQjz
— Sumit (@SumitHansd) July 30, 2025