Whales: సునామీతో జపాన్ తీరానికి కొట్టుకువచ్చిన భారీ తిమింగళాలు.. వీడియో
Whales: జపాన్ తీరానికి భారీ తమింగళాలు కొట్టుకువచ్చాయి. కనీసం నాలుగు తిమింగళాలు చీబాలోని తతయేమా తీరానికి వచ్చినట్లు జపాన్ మీడియా పేర్కొన్నది. రష్యాలోని కామ్చట్కా ద్వీపంలో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.
టోక్యో : జపాన్ తీరానికి భారీ తమింగళాలు(Whales) కొట్టుకువచ్చాయి. కనీసం నాలుగు తిమింగళాలు చీబాలోని తతయేమా తీరానికి వచ్చినట్లు జపాన్ మీడియా పేర్కొన్నది. రష్యాలోని కామ్చట్కా ద్వీపంలో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర జపాన్‌లో ఉన్న ఇషినోమాకి తీరం వద్ద సుమారు 50 సెంటీమీటర్ల ఎత్తులో అలలు వస్తున్నాయి. చిబా ప్రావిన్సులోని కుజుకురి బీచ్ వద్ద ఉన్న నదిలోకి సునామీ అలలు వస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తొలి సునామీ అలలు చేరుకున్నా.. మరికొన్ని గంటల్లో భారీ సునామీలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు జపనీస్ అధికారులు చెబుతున్నారు. భూకంపం వచ్చిన ఒక రోజు తర్వాత కూడా భారీ సైజులో ఉండే సునామీలు తీరాన్ని తాకే ప్రమాదం ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. సునామీలను పరిశీలిస్తున్నామని, వాటి నుంచి రిస్క్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. సునామీలు అకస్మాత్తుగా అటాక్ చేస్తాయని, వార్నింగ్ ఎత్తివేసే వరకు సురక్షిత ప్రాంతాలను విడిచి వెళ్లరాదు అని అధికారులు పేర్కొన్నారు.
JUST IN: At least 4 whales have washed up along the coast of Japan, hours after 8.8 earthquake pic.twitter.com/t9siMZDHFS
— BNO News Live (@BNODesk) July 30, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

