ITBP bus : ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) కు సంబంధించిన బస్సు అదుపుతప్పి తావి నది (Tawi river) లో పడింది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని గండేర్బల్ (Ganderbal) జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఐటీబీపీకి చెందిన జవాన్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకొచ్చేందుకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, ఆయుధాలు మాత్రమే ఉండటంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.
బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు సంబంధించిన టీమ్స్ ఘటనా ప్రాంతానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. గాయపడిన డ్రైవర్ బయటికి తీసి ఆస్పత్రికి తరలించాయి. పరీక్షించిన వైద్యులు అతడికి ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. బస్సును, బస్సులోని విలువైన ఆయుధాలను బయటికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
#WATCH | Ganderbal, J&K | An ITBP bus was on its way to carry the troops when it slipped into the river. The driver, who sustained minor injuries, is now stable. NDRF, SDRF and the police are rescuing the bus. Fortunately, a major incident was averted as there were no troops in… pic.twitter.com/tNsHJUoON2
— ANI (@ANI) July 30, 2025