Malegaon Blast Case | మాలేగావ్ పేలుడు కేసులో (Malegaon blast) ముంబైలోని ప్రత్యేక కోర్టు (special court in Mumbai) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ (Pragya Singh Thakur), లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురిని ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.
2008 సెప్టెంబరు 29న మహారాష్ట్రలోని నాసిక్‌లో గల మాలేగావ్‌లో మసీదుకు సమీపంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు తీవ్రతకు ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో తొలుత యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తు ప్రారంభించగా.. ఆపై కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏ స్వీకరించింది. ఈ కేసులో ఇప్పటివరకు 220 మంది సాక్షులను విచారించారు.
ఈ ఘటనపై 17ఏళ్ల పాటు విచారణ జరగ్గా తాజాగా జస్టిస్ ఏకే లహోటి (AK Lahoti)తీర్పును వెలువరించారు. ఇక ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్తోపాటూ లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్, మేజర్ (రిటైర్డ్) రమేష్ ఉపాధ్యాయ్, సుధాకర్ చతుర్వేది, అజయ్ రహిర్కర్, సుధాకర్ ధర్ ద్వివేది అలియాస్ శంకరాచార్య, సమీర్ కులకర్ణిలను నిర్దోషులుగా తేల్చింది.
Also Read..
Klyuchevskoy volcano | భారీ భూకంపం తర్వాత.. రష్యాలో బద్ధలైన క్లూచెవ్స్కోయ్ అగ్నిపర్వతం
Air Traffic Glitch | ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య.. రద్దైన వందలాది విమానాలు
Oopiri Ooyalaga Song | ‘ఊపిరి ఊయలగా’.. ‘వార్2’ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్