వాషింగ్టన్: సుంకాలు, జరిమానాలతో భారత్‌పై విరుకుపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం.. ఆరు భారతీయ ఆయిల్ కంపెనీలకు (Oil Companies) షాకిచ్చింది. ఇరాన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారన్న ఆరోపణలతో మన చమురు కంపెనీలపై ఆంక్షలు (US Sanctions) విధించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చమురుతో నిధులు సమకూర్చుకొని మధ్య ప్రాచ్యంలో సంఘర్షణలకు ఇరాన్ ఆజ్యం పోస్తున్నదని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో టెహ్రాన్ ఆదాయన వనరులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
ఈ జాబితాలో కాంచన్ పాలిమర్స్, అల్కెమికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, రామ్నిక్లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ, జూపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్, పెర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. వీటితోపాటు టర్కీ, యూఏఈ, చైనా, ఇండోనేషియాలోని పలు సంస్థలపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. 2024, జనవరి నుంచి 2025 జనవరి మధ్య ఆయా సంస్థలు ఇరాన్ నుంచి మిథనాల్, టోలున్, పాలీథైలిన్ వంటి పదార్థాలను దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత్‌కు చెందిన చమురు కంపెనీలు పదుల మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ చేసే దిగుమతి చేసుకున్నాయని యూఎస్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
భారత్‌పై 25 శాతం సుంకాలు.. జరిమానాలు కూడా..: డొనాల్డ్ ట్రంప్
Donald Trump | భారత్‌పై టారీఫ్‌లు.. ఫెనాల్టీలు.. పాకిస్థాన్‌తో ట్రంప్ వాణిజ్య ఒప్పందాలు..
ఎక్కడ చూసినా భారతీయులే.. ప్రపంచంలో అత్యధిక వలసదారులు భారత్ నుంచే