Maharastra CM : ఉగ్రవాదం (Terrorism) గతంలో ఎన్నడూ కాషాయం (Saffron) రంగు పులుముకోలేదని, పులుముకోదని, భవిష్యత్తులో కూడా పులుముకోబోదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. మాలేగావ్ (Malegaon) బ్లాస్ట్ కేసు (Blast case) లో ఏడుగురు నిందితులను ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు (Special court) నిర్దోషులుగా ప్రకటించడంపై ఆయన స్పందించారు.
మాలేగావ్ బ్లాస్ట్ కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ సహా ఏడుగురు నిందితులను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆ పేలుడు ఘటనతో వారికి సంబంధం ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా 2008 సెప్టెంబర్ 29న ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలోని మాలేగావ్‌లోని మసీదు దగ్గర టూవీలర్‌కు అమర్చిన బాంబు పేలి ఆరుగురు మృతిచెందారు. మరో 101 మంది గాయపడ్డారు. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో తీర్పు వెలువడింది.