దేవరకొండ, మార్చి 11 : తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకుంటున్నరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని శివ సాయి ఫంక్షన్ హాల్లో చందంపేట మండలం నుండి మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 500 మంది బీఆర్ఎస్లో చేరారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో వీరందరికి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయిందన్నారు.
6 గ్యారంటీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని తెలిపారు. కేటీఆర్ ఎక్కడ సమావేశం నిర్యహించిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో దేవరకొండలొ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గాజులు ఆంజనేయులు, బిల్యా నాయక్, రమేశ్ నాయక్, కిషన్ నాయక్, టీవీఎన్ రెడ్డి, ముత్యాల శరవయ్య, లోక్య నాయక్, వెంకట్ రెడ్డి, వల్లపు రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సుభాష్ గౌడ్, శంకర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, చంద్ర శేఖర్, రవి, నీలా రవి, రూప్లే నాయక్, అంజి గౌడ్, హరీలాల్, భవాని, చంద్ర కళ, మధు, మురళి, బాలయ్య, మోహన్ కృష్ణ, మహేశ్ పాల్గొన్నారు.