Health tips : చాలా మందికి తియ్యటి పానీయాలు (Sweet drinks) అంటే ఇష్టం. స్వీట్‌గా ఉండే కూల్‌డ్రింక్స్‌ను ఇష్టంగా సేవిస్తుంటారు. అయితే ఇలా అదే పనిగా స్వీట్ డ్రింక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వీట్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే ప్రాణాంతక లివర్క్యాన్సర్ (Liver cancer) వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి స్వీట్ డ్రింక్స్ అతిగా తీసుకునే అలవాటు ఉన్న వారు ఇప్పటికైనా తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
స్వీట్డ్రింక్స్లో చక్కెర స్థాయిలు, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటీవ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పదార్థాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని తగ్గిస్తాయి. ప్రీ రాడికల్స్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇవన్నీ లివర్ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పోస్ట్ మోనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఈ స్వీట్ డ్రింక్స్ మరింత ప్రమాదం అని చెబుతున్నారు.
ప్రతిరోజూ స్వీట్ డ్రింక్స్ తీసుకునే వారు కాలేయ క్యాన్సర్ బారినపడే ముప్పు ఎక్కువగా ఉందని సౌత్కరోలినా యూనివర్సిటీ, బ్రిగమ్ అండ్ వుమెన్స్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. సుమారు లక్ష మందికిపైగా పోస్ట్ మెనోపాజ్‌లో ఉన్న మహిళలపై అధ్యయనం చేయగా నెలకు మూడు, అంతకంటే తక్కువ స్వీట్ డ్రింక్స్ తాగే వ్యక్తులతో పోలిస్తే.. ప్రతిరోజూ ఒకటి, అంతకంటే ఎక్కువ స్వీట్ డ్రింక్స్ తాగే వ్యక్తులకు కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 78% ఎక్కువని అధ్యయనంలో తేలింది. కాలేయ క్యాన్సర్ వ్యాధితో మరణించే ప్రమాదం 73% ఎక్కువని వెల్లడైంది.
నేషనల్ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు సంబంధించిన నేషనల్లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ కూడా ఇదే విషయాన్ని ప్రచురించింది. షుగర్, కాలేయ క్యాన్సర్ మధ్య సంబంధం ఉందని ఈ పరిశోధన ప్రధాన రచయిత లాంగ్ గ్యాంగ్ జావో వెల్లడించారు. ఎక్కువ చక్కెర ఉన్న పానీయాలను ప్రతిరోజూ తీసుకుంటే అది కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని.. కాలేయ క్యాన్సర్‌తోపాటు, కాలేయ సిర్రోసిస్, కాలేయ వైఫల్యం, దీర్ఘకాలిక హెపటైటిస్‌కు కూడా ఇది కారణమవుతుందని అన్నారు. ఈ పరిశోధనను మరింత విస్తృతంగా చేయాల్సి ఉందని వెల్లడించారు.
స్వీట్ డ్రింక్స్ అధికంగా తాగడంవల్ల కేవలం కాలేయ క్యాన్సర్ మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం.. రోజుకు 1 నుంచి 2 లేదా అంతకంటే ఎక్కువ స్వీట్ డ్రింక్స్ తాగే వ్యక్తులకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 26% పెరుగుతుందని వెల్లడించింది. స్వీట్ డ్రింక్స్‌ను అధికంగా తీసుకోవడంవల్ల అధికబరువు, గుండె సమస్యల ముప్పు పెరుగుతుందని.. వాటిలో ఉండే చక్కెర, యాసిడ్ దంతాలపై ఎనామిల్‌ను తొలగించి దంతక్షయం, నోటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.
Rahul Gandhi | కేజ్రీవాల్‌కు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదు.. దొందూ దొందే : రాహుల్‌గాంధీ
Arvind Kejriwal | రాహుల్‌గాంధీని ఒక్క మాటంటే బీజేపీకి పొడుచుకొచ్చింది : అర్వింద్ కేజ్రీవాల్
Sharad Pawar | ఢిల్లీ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్‌కు మద్దతు నిలువాలి : శరద్‌పవార్
Arvind Kejriwal | వాళ్లు డబ్బు, బంగారం పంచినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా..? : అర్వింద్ కేజ్రీవాల్
Atishi nomination | కల్కాజీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. Video
Actress Honey Rose | లైంగిక వేధింపుల కేసులో బాబీ చెమ్మనూర్‌కు బెయిల్
UGC-NET | యూజీసీ నెట్ పరీక్ష వాయిదా.. ఎందుకంటే