Lok Sabha : లోక్‌సభ (Lok Sabha) లో ఈ నెల 28 నుంచి ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పై చర్చ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ కోసం 16 గంటల సమయం కేటాయించారు. ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సమక్షంలో చర్చ జరగనుంది. చర్చ ముగిసిన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చపై సమాధానం ఇవ్వనున్నారు.
అటు రాజ్యసభలో కూడా ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే రాజ్యసభలో 9 గంటలపాటు చర్చ జరగనుంది. జూలై 29 నుంచి చర్చ చేపట్టనున్నారు. రాజ్యసభలో కూడా చర్చకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానం ఇస్తారు. కాగా ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారు.
మహిళలు, చిన్నారులను వదిలేసి పురుష పర్యాటకులే లక్ష్యంగా కాల్చిచంపారు. కొన్ని నిమిషాల వ్యవధిలో మొత్తం 26 మంది ప్రాణాలు తీశారు. వారిలో ఒకరు నేపాల్ జాతీయుడు కాగా, మిగతా వాళ్లంతా భారతీయులు. అయితే ఈ దాడికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు పాల్పడింది.