Harish Rao | విద్యా కమిషన్‌లో విద్యావేత్తలేరి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎల్పీ డి ప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎల్పీ డి ప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీరు ఏర్పాటుచేసిన విద్యా కమిషన్‌లో అసలైన విద్యావేత్తలు ఉన్నారా? సూల్, కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఒక్కరైనా ఉన్నారని చెప్పగలరా? అని ప్రశ్నించారు. ‘ఈ కమిటీ చైర్మన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్. పైగా ఆయనొక ఇంజినీర్. ఆఫీసులు నడపడం వేరు, చదువులు చెప్పడం వేరు, పరిపాలనలో అనుభవం ఉన్నంత మాత్రాన.. పిల్లల సైకాలజీ, పాఠాలు చెప్పే పద్ధతుల మీద పూర్తి అవగాహన ఉన్నట్టా?’ అని ప్రశ్నించారు.
వ్యవస్థను ఈ కమిటీ మార్చుతుందా?
తెలంగాణ విద్యా భవిష్యత్‌ను మార్చేం త అర్హతగాని, నైపుణ్యంగాని ఈ కమిటీకి ఉన్నట్టు తమరు నమ్ముతున్నారా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి హరీశ్‌రావు ప్రశ్నించారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే అత్యంత కీలకమైన విద్యా కమిషన్‌లో.. విద్యావేత్తలు, అనుభవజ్ఞులైన టీచర్లు, చైల్డ్ సైకాలజిస్టులు, సబ్జెక్ట్ నిపుణులు లేకుండానే రాష్ట్రానికి ఒక కొత్త విద్యా విధానాన్ని తయారు చేయవచ్చనే గొప్ప ఆలోచన చేసిన ఘనత, సీఎం రేవంత్‌రెడ్డికే దకుతుందని ఎద్దేవా చేశారు. విద్యాశాఖను ముఖ్యమంత్రి ఎంత నిర్లక్ష్యంగా గాలికి వదిలేశారో చెప్పడానికి ఈ కమిటీ ఏర్పాటే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని దుయ్యబట్టారు. గత రెండేండ్లుగా విద్యాశాఖను గాలికి వదిలేసి, సబ్జెక్ట్ తెలిసిన విద్యావేత్తలకు ఈ బాధ్యత అప్పగించకుండా, సంబంధం లేని వారితో కమిటీ వేసి, కాలయాపన చేసి ఏం సాధించారని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

