Viral news : భార్యకు తెలియకుండా అతడు బాత్రూమ్లో స్పై కెమెరాలు (Spy cameras) పెట్టాడు. రోజూ ఆమె స్నానం (Bathing) చేస్తుండగా రికార్డయిన వీడియోలను సేకరించాడు. ఆ తర్వాత ఆ వీడియోలను భార్యకు చూపించి బ్లాక్ మెయిల్ (Blackmail) చేయడం మొదలుపెట్టాడు. ఇళ్లు (Home), కారు (Car) ఈఎంఐలు (EMIs) కట్టకపోతే నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పెడుతానని గత కొన్ని రోజులుగా బెదిరిస్తున్నాడు. మహారాష్ట్ర (Maharastra) లోని పుణె నగరం (Pune city) లో జరిగిన ఈ ఘటన.. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే (Govt employees) కావడం గమనార్హం.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. క్లాస్ 1 ప్రభుత్వ అధికారిణిగా పనిచేస్తున్న మహిళకు 2020లో ప్రభుత్వ ఉద్యోగి అయిన వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరూ కొంతకాలం బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఆర్థికపరమైన అంశాల విషయంలో విభేదాలు వచ్చాయి. దాంతో భర్త తన భార్యకు తెలియకుండా బాత్రూమ్లో స్పై కెమెరాలు పెట్టాడు. రోజూ ఆమె స్నానం చేస్తున్నప్పుడు వీడియోలను రికార్డు చేశాడు.
తర్వాత ఆ వీడియోలను భార్యకు చూపించి.. ‘ప్రతి నెల ఇళ్లు, కారు ఈఎంఐలు నువ్వే కట్టాలి. లేదంటే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పెడుతా’ అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దాంతో విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారు, ఇంటి లోన్ కట్టాలని, పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ తన భర్త నిత్యం తనను వేధిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
మానసికంగా, శారీరకంగా తన రోజూ హింసిస్తున్నాడని ఆమె తెలిపింది. భర్త కుటుంబసభ్యుల నుంచి కూడా వేధింపులు ఎదురవుతున్నాయని తెలియజేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా సాంకేతిక ఆధారాలు, వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు.