హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ మాఫియా (Drugs Mafia) పై పోలీసులు (Police) ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా నగరంలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న 9 మందిని హెచ్‌న్యూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిని తొమ్మిది మందిలో ఆరుగురు కొకైన్ సరఫరా చేస్తున్నవారు కాగా.. మరో ముగ్గురు మెఫిడ్రీన్ సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 286 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎక్స్టసీ, ఒక గన్, 12 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.