బొప్పాయి బ్రేక్‌ఫాస్ట్
ప్రస్తుతం చాలామంది పండ్ల ముక్కల్నే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. అలాంటివారు అల్పాహారంగా బొప్పాయిని తీసుకుంటే, మరిన్ని ఉపయోగాలు ఉంటాయని నిపుణులు సెలవిస్తున్నారు.
ప్రస్తుతం చాలామంది పండ్ల ముక్కల్నే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. అలాంటివారు అల్పాహారంగా బొప్పాయిని తీసుకుంటే, మరిన్ని ఉపయోగాలు ఉంటాయని నిపుణులు సెలవిస్తున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తీసుకోవడం వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు.
బొప్పాయిలోని ‘పాపైన్’ అనే ఎంజైమ్.. ప్రొటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే బొప్పాయిని తినడం వల్ల.. రోజంతా జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. ఇక బొప్పాయిలో పీచు పదార్థం, నీటి శాతం అధికం. ఇది పేగుల కదలికలను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్యను సహజసిద్ధంగానే తగ్గిస్తుంది.
బొప్పాయిని రెగ్యులర్‌గా తీసుకుంటే.. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా, బొప్పాయిలో కేలరీలు తక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికీ మంచి ఎంపిక. ఇందులో ఉండే విటమిన్ సి.. శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.
బొప్పాయిలోని ఫైబర్, పొటాషియం.. రక్తపోటును నియంత్రించడంతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ ముందుంటాయి. ఫలితంగా, హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులోని యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు.. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వృద్ధాప్య ఛాయల్ని అడ్డుకుంటాయి. ఇలా..
బొప్పాయిని అల్పాహారంగా తీసుకుంటే, ఆరోగ్యంతోపాటు అందం కూడా సొంతమవుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

