Digital payments : ఆగస్టు 1వ తేదీ (August 1st) నుంచి దేశంలోని అన్ని పోస్టాఫీస్‌ల (Post offices) లో డిజిటల్ పేమెంట్స్ (Digital payments) ను స్వీకరించనున్నారు. పోస్టల్ విభాగంలో ఐటీ నూతన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, డిజిటల్ చెల్లింపులకు వీలవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం పోస్టాఫీస్‌లు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వ్యవస్థతో అనుసంధానం కాలేదు. ఈ నేపథ్యంలో డైనమిక్ క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవీలు నిర్వహించే విధంగా కొత్త అప్లికేషన్‌ను తెస్తున్నామని అధికారులు చెప్పారు. ఆగస్టు 1 నాటికి అన్ని పోస్టాఫీసుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఐటీ 2.0 కింద ప్రయోగాత్మకంగా కర్ణాటక సర్కిల్లో డిజిటల్ పేమెంట్స్ స్వీకరణ మొదలైంది.