Bombay high court : చనిపోయిన తన కుమారుడి వీర్యాన్ని (Semen) నాశనం చేయవద్దని, తమకు అప్పగించాలని మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) కి చెందిన ఓ తల్లి బాంబే హైకోర్టు (Bombay high court) ను ఆశ్రయించింది. పెళ్లి కాకుండానే తన కుమారుడు క్యాన్సర్తో మృతిచెందాడని, కుటుంబ వారసత్వాన్ని నిలుపుకునేందుకు అతడి వీర్యాన్ని తమకు అప్పగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
తమను సంప్రదించకుండానే తన కుమారుడు మరణానంతరం తన వీర్యాన్ని నాశనం చేయమని సంతాన సాఫల్య కేంద్రం (ఐవీఎఫ్) లోని సమ్మతి పత్రాలపై సంతకం చేశారని ఆమె కోర్టుకు చెప్పారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ మనీష్ పటేల్ ఏకసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించే వరకు వీర్యాన్ని కాపాడాలని సంతాన సాఫల్య కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జూలై 30వ తేదీకి వాయిదా వేసింది.
తమ ఏకైక కుమారుడు ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడటంతో వంశాభివృద్ధి కోసం అతడి వీర్యాన్ని ఐవీఎఫ్ సెంటర్లో భద్రపర్చారు. అయితే తన మరణానంతరం తన వీర్యాన్ని నాశనం చేయవచ్చునని ఐవీఎఫ్ కేంద్రానికి ఇచ్చిన సమ్మతి పత్రంలో అతడు సంతకం చేశాడు. ఈ క్రమంలో కుమారుడి అతడి వీర్యాన్ని గుజరాత్లోని ఐవీఎఫ్ సెంటర్కు తరలించాలని తల్లి ముంబైలోని సంతాన సాఫల్య కేంద్రాన్ని కోరింది.
దాంతో ఆమె కుమారుడు తన వీర్యాన్ని మరణాననంతరం నాశనం చేయవచ్చని సమ్మతి పత్రంపై సంతకం చేసిన విషయాన్ని వారు తెలిపారు. దాంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు.