Sharad Pawar | హిందీకి మేం వ్యతిరేకం కాదు.. కానీ ప్రైమరీ స్కూల్ స్థాయిలో వద్దు : శరద్‌పవార్
Sharad Pawar | మహారాష్ట్ర (Maharastra) ప్రజలు హిందీ (Hindi) భాషకు వ్యతిరేకం కాదని, అయితే 1 నుంచి 4 తరగతుల ప్రాథమిక పాఠశాల (Primary School) విద్యార్థులు తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని నిబంధన విధించడం మాత్రం తగదని ఎన్సీపీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు.
Sharad Pawar : మహారాష్ట్ర (Maharastra) ప్రజలు హిందీ (Hindi) భాషకు వ్యతిరేకం కాదని, అయితే 1 నుంచి 4 తరగతుల ప్రాథమిక పాఠశాల (Primary School) విద్యార్థులు తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని నిబంధన విధించడం మాత్రం తగదని ఎన్సీపీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. 5వ తరగతి నుంచి హిందీ నేర్చుకోవడం విద్యార్థులకే మంచిదన్నారు.
భాషా వివాదాలపై శుక్రవారం పవార్ స్పందిస్తూ.. దేశంలో 55 శాతం మంది మాట్లాడే హిందీని అలక్ష్యం చేయలేమన్నారు. మరాఠా, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని మూడోభాషగా బోధించాలని గత వారం మహారాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతో వివాదం మొదలైంది.
మహారాష్ట్ర విద్యార్థులపై హిందీని రుద్దే ప్రయత్నాన్ని తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని, జూలై 5, 7 తేదీల్లో విడివిడిగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని శివసేన (ఉద్ధవ్), మహారాష్ట్ర నవ నిర్మాణసేన పార్టీలు గురువారం ప్రకటించాయి. మరాఠీ మూలాలు రూపుమాపడానికి రాష్ట్ర ప్రభుత్వం భాషాపరమైన ఎమర్జెన్సీని విధిస్తోందని విమర్శలు చేశాయి.
Read More >>
దేవుని గుడికి ఏనుగును బహూకరించిన నటి త్రిష
శివసేన ఎంపీ కారు డ్రైవర్‌కు రూ.150 కోట్ల భారీ బహుమతి
దిగొస్తున్న బంగారం ధర.. మరో రూ.930 తగ్గిన రేటు
ప్రియురాలిని పెళ్లాడిన జెఫ్ బెజోస్.. ఫొటో వైరల్
ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్ స్వేచ్ఛ : కేటీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

