KTR | హైదరాబాద్ : సీనియర్ మహిళా జర్నలిస్ట్, టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ అకాల మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్, నిబద్ధత గల రచయిత్రి, తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ కలిగి తెలంగాణ వాది అని, ఆమె అకాల మరణం విని తీవ్ర ఆవేదనకు లోనయ్యాను అని, మాటలు రావడం లేదన్నారు కేటీఆర్. తెలంగాణ ఒక ప్రతిభ కలిగిన మహిళా మేధావిని కోల్పోయిందిని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆమె కుమార్తెకు, తల్లికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఇంతటి బరువైన విషాదకర సమయంలో వారి కుటుంబం స్థైర్యాన్ని పొందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపిన కేటీఆర్, స్వేచ్ఛ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
జీవితంలో తీవ్రమైన ఒత్తిడులు ఎదురవుతున్నవారు ఎవరైనా ఒంటరిగా ఉండకండి. దయచేసి నిపుణుల సహాయం తీసుకోండి. ఎన్ని కష్టాలున్నా, జీవితాన్ని ముగించాలన్న ఆలోచన ఎవరి మనసులోనూ రాకూడదని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.