హొర్ముజ్‌లో ఇరాన్ ‘నేవల్ మైన్స్’!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు 12 రోజులైనా చల్లారడం లేదు. చమురు రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్‌కు ఇబ్బందులు పెరుగుతున్నాయి.
- నౌకలు వాటిని సమీపిస్తే తునాతునకలు చేయడమే
- పసిగట్టడానికి వీలు లేని చవకైన ఆయుధం
(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియా ఉద్రిక్తతలు 12 రోజులైనా చల్లారడం లేదు. చమురు రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్‌కు ఇబ్బందులు పెరుగుతున్నాయి. చమురు ట్యాంకర్ల రవాణాకు భద్రతను కల్పిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో హొర్ముజ్ జలాల్లో ‘నేవల్ మైన్స్’ను ఇరాన్ సిద్ధం చేసినట్టు అమెరికా ఆరోపిస్తుంది. ప్రాథమికంగా డజను మైన్లను ఇరాన్ ఇప్పటికే ఆన్‌బోర్డ్ చేసినట్టు చెప్తున్నది. ఈ మైన్లు పేలితే, హొర్ముజ్ జలాల్లోని నౌకలకు ప్రమాదమని ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అసలేమిటీ మైన్స్? వీటి ప్రభావమేంటొ తెలుసుకుందాం.
ఏమిటీ నేవల్ మైన్? ఎలా పని చేస్తుంది?
నేవల్ మైన్స్ అనేవి ఒక రకమైన పేలుడు పదార్థాలు. నీటి లోపల వీటిని సిద్ధం చేస్తారు. ఒక్కో మైన్‌లో 900 కిలోల వరకూ పేలుడు సామగ్రి ఉంటుంది. ధర కూడా చాలా తక్కువ. ఒక్కో మైన్ బహిరంగ మార్కెట్లో రూ. లక్ష వరకూ ఉంటుంది. లక్షిత నౌక దగ్గర్లోకి రాగానే.. ఈ మైన్ యాక్టివేట్ అయ్యి.. భారీయెత్తున విస్ఫోటం జరుగుతుంది. షాక్ వేవ్స్‌తో నౌక కింది భాగంతో (హుల్) పాటు షిప్ నడవడానికి అవసరమయ్యే ఎలక్ట్రానిక్, మెకానికల్ వ్యవస్థలు దెబ్బతింటాయి. గ్యాస్ బబుల్స్ నౌకను నీటిలో ముంచేస్తుంది.
భిన్న రకాలు కూడా..
- మూర్డ్ మైన్స్: సముద్ర అంతర్భాగంలో ఓ బలమైన వస్తువుతో కేబుల్‌కు అనుసంధానించబడి నీటి ఉపరితలానికి కాస్త కింద తేలియాడుతుంది. నౌక దగ్గరకు రాగానే పేలుస్తుంది.
- డ్రిఫ్టింగ్ మైన్స్: నీటిలో తేలియాడుతూ అలల ద్వారా ప్రయాణించి లక్ష్యాన్ని పేలుస్తాయి.
- లింపెట్ మైన్స్: అయస్కాంతాల ద్వారా నౌక కింది భాగంలో అతుక్కొని పేల్చుతాయి.
- బాటమ్ మైన్స్: సముద్ర అంతర్భాగంలో ఉంటాయి. నౌక రాగానే దాడి చేస్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

