Trisha : నటి త్రిష (Actress Trisha) చెన్నై (Chennai) కి చెందిన పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా (PFCI) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దేవుని గుడికి యాంత్రిక ఏనుగును బహూకరించారు. అరుప్పుకోట్టై (Aruppukottai) లోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ (Sri Ashtalinga Athisesha Selva Vinayagar) ఆలయానికి వారు ‘గజ’ అనే పేరుగల యాంత్రిక ఏనుగును బహుమతిగా ఇచ్చారు.
ఆ యాంత్రిక ఏనుగును సంప్రదాయ మంగళవాయిద్యాల చప్పుళ్ల మధ్య అందజేసినట్లు పీఎఫ్సీఐ నిర్వాహకులు తెలిపారు. కాగా ఆలయ వేడుకల కోసం యాంత్రిక ఏనుగును బహూకరించడం తమిళనాడులో ఇదే తొలిసారి.