Digital Fraud : భారత పౌరులు (Indians) 2024 ఏడాదికిగాను సైబర్ నేరగాళ్ల (Cyber criminals) చేతిలో మొత్తం రూ.23 వేల కోట్లు నష్టపోయారు. ఢిల్లీ (Delhi) కి చెందిన మీడియా, టెక్ కంపెనీ (Media, Tech Company) డాటా లీడ్స్ (DataLEADs) తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. మరోవైపు భారతీయులు ఈ ఏడాది రూ.1.2 లక్షల కోట్లు మోసపోయారని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (Indian Cybercrime Coordination Centre) తెలిపింది.
2024లో సైబర్ నేరగాళ్ల చేతిలో భారతీయులు పోగొట్టుకున్న సొమ్ము 2023లో పోగొట్టుకున్న సొమ్ముతో పోల్చితే మూడింతలు ఎక్కువని, అదే సమయంలో 2023లో ఇండియన్స్ మోసపోయిన సొమ్ముతో పోల్చితే 10 రెట్లు ఎక్కువని డాటాలీడ్ వెల్లడించింది. 2023లో సైబర్ క్రిమినల్స్ భారతీయుల నుంచి రూ.7,465 కోట్లు దోచుకున్నారని, 2022లో రూ.2,306 కోట్లు దోపిడీ చేశారని తెలిపింది.
సైబర్ నేరాలకు సంబంధించి 2024లో మొత్తం 20 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయని డాటాలీడ్స్ ప్రకటించింది. 2023లో నమోదైన 15.6 లక్షల ఫిర్యాదులతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ అని పేర్కొంది. ఇక 2019లో నమోదైన సైబర్ క్రైమ్స్ ఫిర్యాదులతో పోల్చుకుంటే 2024లో నమోదైన ఫిర్యాదులు 10 రెట్లు ఎక్కువని తెలిపింది.