China on USA | ‘ఆ పని మీరు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా?’.. అమెరికాపై చైనా ఫైర్
China on USA | అమెరికా (USA) తీరుపై, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీరుపై చైనా (China) ఆగ్రహం వ్యక్తంచేసింది. రష్యా (Russia) తో వాణిజ్యం చేయొద్దంటూ అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరించడంపై తీవ్రంగా మండిపడింది.
China on USA : అమెరికా (USA) తీరుపై, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీరుపై చైనా (China) ఆగ్రహం వ్యక్తంచేసింది. రష్యా (Russia) తో వాణిజ్యం చేయొద్దంటూ అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరించడంపై తీవ్రంగా మండిపడింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెడితే భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుండటంపై అసహనం వ్యక్తంచేసింది.
అమెరికా దుర్నీతిని చైనా ఎండగట్టింది. మిగతా దేశాల సంగతి పక్కన పెడితే.. రష్యాతో అమెరికానే భారీగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఆరోపించింది. ఈరోజు వరకు కూడా రష్యాతో అమెరికా వాణిజ్యం కొనసాగుతోందని తెలిపింది. ‘రష్యాతో ఇతరులు వాణిజ్యం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా’ అని అమెరికాను ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ నిలదీశారు.
కాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ మొత్తంలో టారిఫ్‌లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై గెంగ్ షువాంగ్ స్పందిస్తూ.. మిగతా దేశాల కంటే అమెరికానే ఎక్కువగా రష్యాతో వ్యాపారం చేస్తోందన్నారు. ఉక్రెయిన్‌కు కానీ, రష్యాకు కానీ తాము ఆయుధాలు సరఫరా చేయడంలేదని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి వాణిజ్యం మాత్రమే చేస్తున్నామని తెలిపారు.
భద్రతా మండలిలో చైనాపై అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను గెంగ్ షువాంగ్ తోసిపుచ్చారు. రష్యా, ఉక్రెయిన్‌తో తమ వాణిజ్య కార్యకలాపాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపారు. ఇతరులపై నిందలు వేయడం మానుకోవాలని అమెరికాకు హితవు పలికారు. అదేవిధంగా ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకడానికి ఇదే సరైన సమయమని, అందుకు కృషి చేయాలని ట్రంప్‌కు సూచించారు.
Read More >>
ప్రముఖ నటి రాధికకు డెంగ్యూ జ్వరం.. నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే
రేపిస్ట్లు, మర్డర్ చేసిన వాళ్లు సమాజంలో బతకొచ్చు.. కాని అవి మాత్రం… : రేణూ సూటి ప్రశ్నలు
రష్యాతో భారత్ చమురు బంధమే.. మాకు చికాకు తెప్పించే అంశం : అమెరికా విదేశాంగ మంత్రి
ట్రంప్ టారిఫ్ ఏయే దేశంపై ఎంత ఉందో తెలుసా?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

