వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) విధించిన డెడ్‌లైన్ ప్రకారం కొన్ని దేశాలపై సుంకాన్ని పెంచేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి టారిఫ్‌లను పెంచనున్నట్లు ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. యావత్ ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. ఆగస్టు ఏడో తేదీ నుంచి కొన్ని దేశాలపై అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు కూడా అమెరికా వాణిజ్య శాఖ తన వెబ్సైట్లో తెలిపింది. ఒకవేళ ఏదైనా విదేశీ కంపెనీ తమ ఉత్పత్తులను అమెరికాలో అమ్మాలనుకుంటే, వాటినిపై అక్కడి ప్రభుత్వం సుంకాన్ని వసూల్ చేస్తుంది. ఇప్పుడు ఆ టారిఫ్‌ను ట్రంప్ పెంచేశారు. దీని వల్ల వినియోగదారులపై ఆయా కంపెనీలు అదనపు భారాన్ని మోసే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ట్రంప్ తన కొత్త టారిఫ్ విధానాన్ని ఓ ఎగ్జిక్యూటివ్ ఆదేశంతో ఖరారు చేశారు. ఏయే దేశాలపై ఎంత సుంకం విధిస్తున్నారన్న విషయాన్ని వైట్‌హౌజ్ తన వెబ్సైట్లో పెట్టింది.
10 శాతం.. ఫాక్లాండ్ దీవులు, యూకేతో పాటు ఎగ్జిక్యూటివ్ ఆదేశాల్లో లేని దేశాలపై
15 శాతం.. ఆఫ్ఘనిస్తాన్, అంగోలా, బొలివియా, బోత్సవానా, కెమరూన్, చాద్, కోస్టారికా, కాంగో, ఈక్వెడార్, గునియా, ఫిజి, ఘానా, ఐస్ ల్యాండ్, ఇజ్రాయిల్, జపాన్, జోర్డాన్, లిసోతా,మడగాస్కర్, మల్వాయి, మారిషస్, మొజాంబిక్, నమీబియా, న్యూజిలాండ్, నైజీరియా, మెసిడోనియా, నార్వే, పప్వా నూ గినియా, సౌత్ కొరియా, ట్రినిడాడ్ అండ్ టొబోగో, టర్కీ, ఉగాండా, వనౌతు, వెనిజులా, జాంబియా, జింబాబ్వే
18 శాతం.. నికరాగ్వే
19 శాతం.. కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్
20 శాతం.. బంగ్లాదేశ్, శ్రీలకం, థాయిలాండ్, తైవాన్, వియత్నం
25 శాతం.. బ్రూనై, ఇండియా, కజకిస్తాన్, మల్డోవా, టునిషియా
30 శాతం.. అల్జీరియా, బోస్నియా, హెర్జిగోనివా, లిబియా, దక్షిణాఫ్రికా
35 శాతం.. ఇరాక్, సెర్బియా
39 శాతం.. స్విట్జార్లాండ్
40 శాతం .. లావోస్, మయన్మార్(బర్మ)
41 శాతం.. శివ
చైనాతో చర్చలు జరుగుతున్నాయి. కెనడాపై 35 శాతం టారిఫ్ విధించారు. మెక్సికోపై 35 శాతం సుంకం విధించనున్నారు. బ్రెజిల్ ఉత్పత్తులపై 50 శాతం పన్ను వసూల్ చేయనున్నారు.