Prema O Prema | ‘పోలీస్ కంప్లైంట్’ నుంచి మెలోడియస్ సాంగ్ విడుదల: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర జంటగా యాక్షన్ థ్రిల్లర్!
PoliceComplaint : సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మరియు వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’.
Police Complaint | సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మరియు వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి “ప్రేమ ఓ ప్రేమ” అనే బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్‌ను సీనియర్ జర్నలిస్టు ప్రభు లాంచ్ చేశారు.
యూత్‌ను ఆకట్టుకునే ‘ప్రేమ ఓ ప్రేమ’
వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర జంటపై చిత్రీకరించిన ఈ ప్రేమ గీతం అన్విక ఆడియోస్ ద్వారా విడుదలైంది. ఈ పాటకు సుధాకర్ మారియో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. “ఈ పాట యూత్‌కు బాగా నచ్చుతుందని, ట్రెండింగ్ హిట్ సాంగ్స్‌లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందని” ధీమా వ్యక్తం చేశారు.
52 మంది సీనియర్ నటులతో భారీ యాక్షన్ థ్రిల్లర్
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సుమారు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు నటించడం విశేషం. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేదిల పాత్రలు వారి గత చిత్రాలకు భిన్నంగా, పవర్‌ఫుల్‌గా ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ అందించిన ఫైట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
యాక్షన్, కామెడీ, రొమాన్స్ మరియు హారర్ అంశాల కలయికతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, పృథ్వి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం & నేపథ్య సంగీతం: సంజీవ్ మేగోటి
నిర్మాత: బాలకృష్ణ మహారాణా
సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో
సినిమాటోగ్రఫీ: ఎస్.ఎన్. హరీష్
ఎడిటర్: అనుగోజు రేణుకా బాబు
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్ – రవితేజ
పీఆర్ఓ: అశోక్ దయ్యాల
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

