Renu Desai | సినీ నటి, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. పర్యావరణ పరిరక్షణ, మూగ జీవాల సంరక్షణ, హిందూ ధర్మం వంటి ఎన్నో విషయాల్లో ఆమె చురుకుగా స్పందిస్తూ ఉంటారు. పెట్ లవర్‌గా ఆమె చేసే సేవా కార్యక్రమాలకు ఇప్పటికే ఎంతో మంది అభిమానులున్నారు. తన కూతురు ఆద్య పేరుతో ఓ పెట్ షెల్టర్ హోం కూడా ప్రారంభించారు. అయితే తాజాగా రేణూ దేశాయ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కుక్కపై జరిగిన దుర్మార్గాన్ని గుర్తు చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఒక కుక్క మనిషిని కరిచిందని, ఏ పాపం చేయని వీధి కుక్కల్ని అన్నింటిని చంపేయడం ఎంత న్యాయం? అదే సమాజంలో రేపిస్టులు, మర్డర్లు చేసినవాళ్లు మాత్రం మన చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు!’’ అంటూ ఆమె ప్రశ్నించారు. రేణూ పోస్ట్‌కి కొందరు సపోర్ట్ అందిస్తుండగా, మరి కొందరు మాత్రం మనుషులు, కుక్కలు ఒకటేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే రేణూ పోస్ట్ మాత్రం కొందరిని ఆలోజింపజేస్తుంది. కాగా, రేణూ దేశాయ్ గాయపడిన పశుపక్షుల చికిత్స కోసం స్వంత డబ్బుతో పాటు విరాళాలు సేకరించిన డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం . మూగ జీవాల హక్కులను గౌరవించాలని, వాటిని హింసించడం నేరమేనని ఆమె తరచూ చెబుతుంటారు.
పశు పక్షాదులు కూడా ఈ భూమిపై బతకాల్సిన హక్కు ఉంది అనే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పే ప్రయత్నం ఆమె చేస్తున్నది. ప్రస్తుతం రేణూ తన కూతురు ఆద్యతో కలిసి విదేశీ వెకేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో ‘రైతు’ అనే ప్రాజెక్ట్ పై తీవ్రంగా కృషి చేసిన, అది ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. అంతేగాక ‘ఆద్య’ అనే వెబ్‌సిరీస్ మొదలుపెట్టగా, ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందని సమాచారం. ప్రస్తుతం బుల్లితెర షోలలోనూ ఆమె పెద్దగా కనిపించడం లేదు. రేణూ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తుంది.