F-35 Fighter Jets : ఐదో తరం (Fifth-generation) ఎఫ్-35 యుద్ధ విమానాల (F-35 fighter jets) కొనుగోలు కోసం అమెరికా (USA) తో ఎలాంటి అధికారిక చర్చలు జరుపలేదని కేంద్ర ప్రభుత్వం (Union Govt) లోక్సభ (Lok Sabha) కు స్పష్టంచేసింది. కాంగ్రెస్ ఎంపీ (Congress MP) బల్వంత్ బస్వంత్ వాంఖడే (Balwant Baswant Wankhade) లోక్సభ (Lok Sabha) లో అడిగిన ప్రశ్నకు శుక్రవారం భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ (Kirti Vardhan Singh) ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా భారత్-అమెరికా చేసిన సంయుక్త ప్రకటనలో F-35 యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదన అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో F-35 యుద్ధ విమానాల కొనుగోలు అంశం ఎంతవరకు వచ్చిందని వాంఖడే ప్రశ్నించారు. దాంతో ఆయన పైవిధంగా స్పందించారు.