గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 11:38:57

32 సెక‌న్ల అభిజిత్ ముహూర్తంలోనే..

32 సెక‌న్ల అభిజిత్ ముహూర్తంలోనే..

హైద‌రాబాద్‌: రామ‌చంద్రుడు జ‌న్మించింది అభిజిత్ ముహూర్తంలోనే.  ఆ మ‌నోర‌మ‌ క్ష‌ణాల్లోనే అయోధ్య‌లో రామాల‌య పూజ జ‌రుగుతున్న‌ది.  రాముడి పేరును ఎక్క‌డెక్క‌డ స్మ‌రిస్తారో.. అక్క‌డ ఆ దైవం ప్ర‌స‌న్నం అవుతుంది.  అభిజిత్ మూహూర్తం కేవ‌లం 32 సెకండ్లు మాత్ర‌మే ఉంటుంది. ఆ స‌మ‌యంలోనే పునాదిరాయి వేయ‌నున్నారు.  రాముడు అభిజిత్ ముహూర్తంలోనే పుట్టిన‌ట్లు చ‌రిత్ర‌కారులు చెబుతుంటారు.  ఆద‌ర్శ‌నీయుడైన రాముడికి ఆల‌యం క‌ట్ట‌డం ఆనంద‌దాయ‌క‌మే.  ప్ర‌ధాని మోదీ 40 కేజీల వెండి ఇటుక‌ల‌ను శంకుస్థాప‌న కోసం వాడ‌నున్నారు.  అభిజిత్ ముహూర్త స‌మ‌యంలో మొత్తం 9 రాళ్ల‌కు పూజ చేయ‌నున్నారు.  

భ‌గ‌వాన్ శ్రీరాముడి ఆల‌య నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన భూమిపూజ కార్య‌క్ర‌మంలో క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటిస్తున్నారు.  మోదీ ప్ర‌ధాన పూజ‌లో పాల్గొంటారు. మంత్రాలు చ‌దువుతున్న స‌మ‌యంలో పూజారులు నీరును చ‌ల్ల‌డం లేదు.  ఆర‌తి కోసం కూడా ఎవ‌రూ ద‌గ్గ‌రికి వెళ్ల‌కుండా ఏర్పాట్లు చేశారు.  అతిథులు ఎవ‌రైనా క‌రోనా నెగ‌టివ్ స‌ర్టిఫికెట్ చూపించాల్సిందే. logo