ఆదివారం 17 జనవరి 2021
Mulugu - Nov 14, 2020 , 02:11:45

సాహితి శిఖరం కాళోజీ

సాహితి శిఖరం కాళోజీ

ములుగు, నవంబర్‌13: సమాజంలో అసమానతలు, అన్యాయాలపై తన పదునైన కలంతో ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితి శిఖరం వంటి వారని టీఆర్‌ఎస్‌ ములుగు పట్టణ అధ్యక్షుడు మేర్గు సంతోష్‌యాదవ్‌ అన్నారు. కాళోజీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నాజర్‌ఖాన్‌, జితేందర్‌, రాంప్రసాద్‌, రాజిరెడ్డి, అంజిరెడ్డి, తోకల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.