న్యూఢిల్లీ, మే 20: ‘డబుల్ మ్యుటె ంట్’ కరోనా రకం బీ.1.617 పై ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ప్రాథమిక అధ్యయనంలో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. భారత్‌లో గత అక్టోబర్‌లో మొదటిసారిగా కనుగొన్న బీ.1.617 రకాన్ని డబ్ల్యూహెచ్‌వో ఇటీవల ‘ఆందోళనకర రకం’గా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ వేరియంట్‌పై ఫైజర్, మోడెర్నా టీకాల పనితీరు గురించి పరిశోధన ప్రాథమిక ఫలితాలను వెల్లడించింది.