డబుల్ మ్యుటె ంట్ బీ.1.617పై
న్యూఢిల్లీ, మే 20: భారత్‌లో కరోనా రెండో దశ ఉద్ధృతికి కారణంగా చెబుతున్న ‘బీ.1.617’ అనే రకంపై కూడా కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయని పలువురు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అయితే మిగతా కరోనా రకాలతో పోలిస్తే బీ.1.617ను ఎదిరించేటప్పుడు తక్కువ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇవి మిగతా కరోనా రకాలు సోకినప్పుడు ఉత్పత్తి అయ్యే యాంటీబాడీల్లో సగం ఉంటున్నాయని వివరించారు. యాంటీబాడీలు తక్కువగా ఉత్పత్తి అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన పని లేదని, బీ.1.617 కరోనా వేరియంట్‌ను రెండు టీకాలు సమర్థంగా ఎదుర్కోగలవని తెలిపారు.