BRS Party | తొగుట : తొగుట మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన ఓలపు శ్యామవ్వ అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలుసుకున్నబీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తనవంతుగా రూ.2500 ఆర్ధిక సహాయం అందించారు.
శ్యామవ్వ భర్త దశరథం, పెద్ద కుమారుడు శివకోటిలు కూడా అనారోగ్యంతో మరణించారని తెలుసుకున్న రాంరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు బండారు స్వామి గౌడ్, పులిగారి లక్ష్మణ్, సుతారి రాంబాబు, జహంగీర్, కంకణాల స్వామి తదితరులు ఉన్నారు.
Mancherial | 108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం
MLA Gaddam Vinod | మద్యం మత్తులో జాతీయ రహదారిపై ఎమ్మెల్యే వినోద్ అనుచరులు, పీఏల హల్చల్.. వీడియో
Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు