Malayalam Actress | హోటల్‌కి రమ్మన్నాడు.. యువ రాజకీయ నాయకుడిపై ప్రముఖ నటి లైంగిక ఆరోపణలు
Malayalam Actress | మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల (Mollywood) ఆరోపణలు ఇటీవలే తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.
Malayalam Actress | మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల (Mollywood) ఆరోపణలు ఇటీవలే తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. హేమ కమిటీ నివేదిక తర్వాత పలువురు తారలు తమకు ఎదురైన అనుభవాలను ఒక్కొక్కటికగా బయట పెడుతున్నారు. తాజాగా మరో నటి (Malayalam Actor), మాజీ జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్ (Rini Ann George) ఓ యువ రాజకీయ నాయకుడి (youth leader)పై చేసిన ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఓ యువ రాజకీయ నాయకుడు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ రిని ఆన్ జార్జ్ ఆరోపించింది. ఫైవ్‌స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేశాను రమ్మంటూ అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఈ ఆరోపణలు చేసింది. అయితే, ఆ యువ నాయకుడు ఎవరన్నది మాత్రం చెప్పలేదు. పేరు, పార్టీ వంటి వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించింది. అయితే, నటి ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కేరళలోని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ యువ రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ మంకూటిల్ (Rahul Mamkootathil)గా తెలిపింది. నటి ఆరోపణలతో పాలక్కాడ్ (Palakkad) జిల్లాలోని ఎమ్మెల్యే కార్యాలయం వెలుపల నిరసనకు దిగింది.
Also Read..
Samantha | ఆ రెండింటికీ సమ ప్రాధాన్యం.. అందుకే సినిమాలు తగ్గించా : సమంత
Vishwambhara | విశ్వంభర రిలీజ్ డేట్ చెప్పిన చిరు.. జాప్యానికి కారణం ఇదేనంటూ మెగాస్టార్ క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

