Samantha | ఆ రెండింటికీ సమ ప్రాధాన్యం.. అందుకే సినిమాలు తగ్గించా : సమంత
Samantha | స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, అభినయంతోపాటూ అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Samantha | స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, అభినయంతోపాటూ అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన ఫ్యాషన్‌తోనూ అందరినీ ఆకట్టుకుంటుంటుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటోంది. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సామ్.. సినిమాలు చేయడాన్ని కాస్త తగ్గించిన విషయం తెలిసిందే. ఆ మధ్య ఏడాది గ్యాప్ తీసుకున్న ఈ స్టార్.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. అయినప్పటికీ గతంతోపోలిస్తే చాలా తక్కువ ప్రాజెక్టులకు మాత్రమే సైన్ చేసింది. అందుకు గల కారణాన్ని సామ్ తాజాగా వెల్లడించింది.
గ్రాజియా ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘ఎన్ని సినిమాలు చేశామనేది కాదు, ఎంత మంచి చిత్రాలు తీశామనేది ముఖ్యం. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తూ ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను. గతంతో పోలిస్తే నాలో చాలా మార్పు వచ్చింది. గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నాను. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు, సిరీస్‌లు గుర్తింపు కోసమో, సక్సెస్ కోసమో చేసేవి కావు. అవన్నీ నా మనసుకు దగ్గరగా ఉన్నవి. ఇప్పుడు వర్క్ ప్లానింగ్‌లో మార్పు చేసుకున్నాను. ఫిట్నెస్, సినిమాలు రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తున్నాను. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాను. నా శరీరం చెప్పేది వినడం నేర్చుకున్నా. అందుకే ఇకపై తక్కువ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఒకేసారి ఐదు ప్రాజెక్ట్‌లు చేయను. ప్రాజెక్ట్‌ల సంఖ్య తగ్గినా వాటి నాణ్యత మాత్రం పెరుగుతుంది. మంచి సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాను’ అని సామ్ చెప్పుకొచ్చింది.
Also Read..
Vishwambhara | విశ్వంభర రిలీజ్ డేట్ చెప్పిన చిరు.. జాప్యానికి కారణం ఇదేనంటూ మెగాస్టార్ క్లారిటీ
Comedian | వెంకీలో అంత బాగా నవ్వించిన కమెడీయన్‌కి పెరాలసిస్ వచ్చిందా.. ఆరోగ్య పరిస్థితి ఏంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

