Rahul Sipligunj | తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రాచుర్యం పొందిన యువ గాయకుడు, బిగ్‌బాస్ తెలుగు విజేత, మరియు ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. కొంతకాలంగా తన స్నేహితురాలు హరిణ్య రెడ్డితో ప్రేమలో ఉన్న రాహుల్ ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇరు కుటుంబాల సమ్మతితో ఈ నిశ్చితార్థ వేడుక ఆగస్ట్ 17న హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హోటల్లో అత్యంత గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహిత స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, హరిణ్య రెడ్డి ఎవరు అనే ప్రశ్న కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఆమె పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన సెలబ్రిటీ. తెలుగు దేశం పార్టీకి దగ్గరగా ఉన్న కుటుంబానికి చెందినది హరిణ్య. టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (NUDA) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్యా రెడ్డి. ఈ కుటుంబం మొత్తం నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉంటుందని రాజకీయ వర్గాల టాక్. ఇక ఇప్పటికే హిరణ్యాకు సోషల్ మీడియాలో కూడా భారీగా ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 15,000 మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. రాహుల్ సిప్లిగంజ్ కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. రాహుల్ తో పెళ్లి తరువాత ఆమె ఫాలోవర్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది.
రాహుల్ – హరిణి మధ్య పరిచయం స్నేహితుల ద్వారా ఏర్పడి, ఆ స్నేహమే ప్రేమగా మారింది.ఇండస్ట్రీలో రాహుల్‌కు పలువురు నటీమణులతో డేటింగ్ సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఎట్టకేలకి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం జరుపుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇక రాహుల్ సిప్లిగంజ్ తాజాగా వారి నిశ్చితార్థానికి సంబంధించిన మరి కొన్ని ఫొటోలు విడుదల చేశారు. ఈ ఫోటోలు అన్ని కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఉండగా, ఇవి నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నిశ్చితార్థ వేడుకలో రాహుల్ సాంప్రదాయ షేర్వాణీతో హాజరవ్వగా, హరిణి రెడ్డి ఆరెంజ్ కలర్ లెహంగా, డిజైనర్ జ్యువెలరీతో మెరిసిపోయారు. ఇద్దరి జంట చాలా అందంగా, అందరినీ ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు.