మంచిర్యాల అర్బన్, ఆగస్టు 21 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్‌కు చెందిన మోర్లె పల్లవి అనే మహిళ 108 అంబులెన్స్‌లో ప్రసవించింది. గురువారం ఉదయం పల్లవికి పురిటినొప్పులు రాగా కుటుంబ సభ్యులు 108 కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మంచిర్యాల సిబ్బంది ఈఎంటీ సత్యనారయణ గర్భిణిని మంచిర్యాల మాతా శిశు హాస్పిటల్‌కి తీసుకవస్తుండగా పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి.
దీంతో వెంటనే ఈ విషయాన్ని వైద్యాధికారులకు సమాచారం అందించి వారి సూచనల మేరకు 108 లోనే ప్రసవం జరిపించగా రెండవ కాన్పులో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఎంసీహెచ్ హాస్పిటల్‌కు తరలించి వైద్యచికిత్సను అందిస్తున్నారు. అత్యవసర సమ యంలో అప్రమత్తంగా వ్యవహరించిన 108 సిబ్బంది ఈఎంటీ సత్యనారయణ, పైలెట్ వెంకటేశ్వరరావు లను 108 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ అభినందించారు.