ముంబై: ముంబైలోని ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) 86వ స్నాతకోత్సవాన్ని ఆకస్మికంగా వాయిదా వేశారు. ఆగస్టు 2న జరగాల్సిన ఈ వేడుకకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ముఖ్య అతిథిగా, బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర ఘుగే గౌరవ అతిథిగా హాజరు కావాల్సి ఉన్నది. అయితే ప్రముఖుల రాకను నిరసిస్తూ, క్యాంపస్లో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమానికి చెందిన విద్యార్థులు ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నదన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో వర్శిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం అధికార వర్గాలు తెలిపాయి.