నగోయా: రెజ్లర్ సుజీత్ కల్కల్(Sujeet) స్వర్ణం గెలిచాడు. 65 కేజీల మెన్స్ ఫ్రీ స్టయిల్ ఈవెంట్లో స్టన్నింగ్ షో ఇచ్చాడు. ఏషియన్ గేమ్స్ ఫైనల్లో తొలుత వెనుకబడ్డ సుజీత్.. ఆ తర్వాత రెండో రౌండ్లో అనూహ్య రీతిలో పర్ఫార్మ్ చేశాడు. తజకిస్తాన్ ప్లేయర్ అబ్దుల్‌మజీద్ కుదేవ్ను 10-9 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వాస్తవానికి తొలి రౌండ్లో సుజీత వెనుకబడ్డాడు. ఆ రౌండ్లో 9-2 తేడాతో తజక్ ప్లేయర్ దూకుడు ప్రదర్శించాడు. కానీ సెకండ్ రౌండ్లో అద్భుతంగా రాణించాడు ఇండియన్ రెజ్లర్. 8-0 తేడాతో రెండో రౌండ్‌ను చేజిక్కించుకున్న సుజీత్ .. ఓవరాల్‌గా 10-9 పాయింట్లతో గోల్డ్ మెడల్ బౌట్లో విజయం సాధించాడు.
Absolutely remarkable comeback by Sujeet 🇮🇳, who takes out Abdulmazhid Kudiev 🇹🇯 10-9 for Asian Games Gold!
Sujeet trailed 9-2 as the first period ended, he came into the second period with a hunger for takedowns as he notched 4 straight to steal the match. pic.twitter.com/Z8itpr6Dwk
— InfaWrest (@InfaWrest) October 2, 2026
ఇవాళ కూడా గోల్డ్ రష్ కొనసాగింది. ఇండియన్ అథ్లెట్లు స్వర్ణాలు గెలిచారు. ఏషియన్ గేమ్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 75కు చేరింది. దీంట్లో 15 స్వర్ణాలు, 25 సిల్వర్, 35 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మెన్స్ 80 కేజీ బాక్సింగ్ ఈవెంట్లో అంకుశ్ పంగల్‌కు స్వర్ణం దక్కింది.