మాకొద్దు.. బడి అన్నం
రోజూ మేం తింటున్న అన్నమే వంట పట్టక చస్తున్నాం ఇప్పుడు పిల్లలు తింటున్న అన్నం మమ్మల్ని తినమని ఊళ్లళ్లతో తిట్లు తినిపించకండి మొన్నటికి మొన్న చదువుల కమిషన్ జీతాలు ఎక్కువైనయన్నదుకే తలకాయలు లంచ్‌బాక్స్‌లో పెట్టుకుంటున్నం ఇప్పుడు పిల్లల బువ్వ కూడా తింటున్నరని మమ్మల్ని చీత్కరానికి గురిచేయకండి.
రోజూ మేం తింటున్న అన్నమే
వంట పట్టక చస్తున్నాం
ఇప్పుడు పిల్లలు తింటున్న అన్నం
మమ్మల్ని తినమని ఊళ్లళ్లతో
తిట్లు తినిపించకండి
మొన్నటికి మొన్న చదువుల కమిషన్
జీతాలు ఎక్కువైనయన్నదుకే
తలకాయలు లంచ్‌బాక్స్‌లో పెట్టుకుంటున్నం
ఇప్పుడు పిల్లల బువ్వ కూడా తింటున్నరని
మమ్మల్ని చీత్కరానికి గురిచేయకండి.
మాకెందుకు సారు రోజూ అన్నం
మా బకాయి డీఏ, పీఆర్సీలు ఇయ్యుండ్రి
మా బువ్వ ఏదో మేం తిని,
మా చదువేదో మేము చెప్పుకుంటాం
మీరిచ్చే పైసలతో వారానికి మూడు గుడ్లు
ఎట్లా పెట్టేదని ఒక్కో రోజు ఎగ్గొట్టితే
మేమే తింటున్నామని బదనాం చేస్తున్నరు
పిల్లలు మా ముందే అన్నం ప్లేట్లు పెట్టి
ఈ బువ్వ మీరైతే తింటారా?
అని అడిగినప్పుడు
ముఖం చాటేసుకుంటున్నం
సర్కారు బడుల్లో చదివే రావట్లేదని
నివేదికలన్నీ మమ్మల్ని వేధిస్తూనే ఉన్నయి
సర్ప్లస్, వర్క్ అడ్జస్ట్మెంట్ల పేరుతో
మా గుండెల్లో గుణపాలు దించుతూనే ఉన్నరు
ఇప్పుడు ఇక మీ భోజనాలు ఎందుకు సార్?
వీలైతే మరో నాలుగు రూపాయలు పెంచి
పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టండి
వండి పెట్టేటోళ్ల జీతాల కష్టాలు తీర్చండి
బియ్యం, ఉప్పు పప్పులను
బంగారం జోకినట్టు జోకకుండా
పిల్లలకు కడుపు నిండా తిండిపెట్టండి
మాకెందుకు సారూ బడిలో రోజూ అన్నం?
ప్రభుత్వ బడులు మూయకుండా
మాకు అన్నం పెట్టే బదులు
బడికి ఇంత సున్నం వేయండి
పిల్లలకు మంచి నీళ్లు ఇవ్వండి
భోజనాల లెక్కల చిక్కుల నుంచి
మమ్మల్ని విముక్తం చేయండి.
మా జీతానికి న్యాయం చేయనీయండి
-సహచరి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

