MLA Kotha prabhakar reddy | తొగుట, సెప్టెంబర్ 3 : తెలంగాణ ప్రజల కరువును తీర్చే కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ కేసీఆర్కు మద్దతుగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన, మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులతో కలిసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ నీటితోనే తెలంగాణ కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుల చిత్రపటానికి జలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని ఎన్నో ప్రాజెక్టులు బ్యారేజీలు పంపు హౌస్ లు, కాలువలు, సబ్ స్టేషన్ లు, భూ సేకరణ ఆర్అండ్ఆర్ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. 94 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మేడిగడ్డ ప్రాజెక్టు కేవలం నాలుగు వేల కోట్లతో పూర్తి చేయడం జరిగిందన్నారు. మేడిగడ్డకు సంబంధించి రెండు పిల్లలకు కృంగితే మొత్తం లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. గత నాలుగైదు ఏళ్లుగా మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు ఉమ్మడి మెదక్ జిల్లా, నల్గొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వెళ్తుండగా ఒక ఎకరానికి నీళ్లు రాలేవని మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమంత్రిగా మిగిలిపోయాడన్నారు.
కాంగ్రెస్ నాయకులకు కండ్లు కనిపిస్తలేవా..?
భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి ఒక్కసారైనా సిద్ధిపేటకు వచ్చావా..? జిల్లాకు సంబంధించిన నీటిపారుదల వ్యవస్థల మీద సమీక్ష నిర్వహించావా అని ఆయన ప్రశ్నించారు. ఎల్లంపల్లి నుండి నంది మేడారం, గాయత్రి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లకు గోదావరి జలాలు పొంగిపొర్లుతుంటే కాంగ్రెస్ నాయకులకు కండ్లు కనిపిస్తలేవా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటున్న కాంగ్రెస్ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో నాడు, నేడు ఎలా పనులు నిర్వహిస్తున్నాడని ఆయన ప్రశ్నించారు.
మేడి గడ్డ పిల్లర్లకు కు మరమ్మత్తులు చేయాలని ఎన్డీఏఎస్ఏ రిపోర్టు ఇవ్వగా రేవంత్ సర్కార్ బుట్ట దాఖలు చేయడం జరిగిందన్నారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో నిర్మించిన సింగూరు, కడెం, ఎల్లంపల్లి, పోలవరం, పులిచింతల, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు లలో కట్టలు, గేట్లు కొట్టుకపోవడం,, పైపులు పటాకుల్లా పేలిపోవడం జరగలేదా..? మరి వాటిపై ఎందుకు కమిషన్లు, విచారణలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందోనని రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతున్నట్లు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతం అయిందన్న దానికి మల్లన్న సాగరే సాక్షిగా నిలుస్తుందన్నారు.
ఎన్ని సీబీఐ విచారణలు చేసినా కేసీఆర్ను ఏమీ చేయలేరు..
మల్లన్న సాగర్ ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని కూడవెళ్లితోపాటు చెరువులు, కుంటలకు ఎంతో మేలు జరిగిందని ఆయన తెలిపారు కాళేశ్వరంఫై వేసిన పీసీ ఘోష్ కమిషన్ కాదని కాంగ్రెస్ కమిషన్ అన్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని సీబీఐ విచారణలు చేసినా కేసీఆర్ను ఏమీ చేయలేరని కడిగిన ముత్యంలా బయటకు వస్తాడన్నారు. నీళ్లిచ్చిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు దేవునిగా కొలుస్తారని, ఎన్ని కష్టాలు వచ్చినా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారన్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుక్కు తుక్కు కావడం ఖాయమని, 2028లో కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చెరుకు లక్ష్మారెడ్డి సొసైటీ చైర్మన్ కే హరికృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు భోంపల్లి మనోహర రావు, రాజమౌళి పంతులు, వెంకటనర్సింహా రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజిరెడ్డి, బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, చిలువేరు మల్లారెడ్డి, దోమల కొమురయ్య, వేల్పుల స్వామి, శ్రీనివాస్ గౌడ్, కృష్ణా రెడ్డి, వంశీ కృష్ణా గౌడ్, నారాయణ రెడ్డి, వెంకటేశ్వరశర్మ, రహీం, తోట అంజిరెడ్డి, జీడిపల్లి రవి, బాణాల శ్రీనివాస్, లింగం, శేఖర్ గౌడ్, యాదగిరి, బోధనం కనకయ్య, కంది రాంరెడ్డి, కొమ్ము శరత్, అరుణ్ కుమార్ ల తో పాటు నియోజకవర్గం లోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Anushka Shetty | అనుష్క సరోజ 2 చేయాలని చెప్పిందట.. ఇంతకీ క్రిష్ ప్లాన్ ఏంటో మరి..?
SSMB 29 | రాజమౌళి – మహేశ్ బాబు సినిమా.. కెన్యా మసాయి మరా వైపే అందరిచూపు.!
Akshay Kumar | గురువాయూర్ ఆలయాన్ని దర్శించుకున్న అక్షయ్ కుమార్